
న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఫిట్ నెస్ తో ప్రపంచ క్రికెట్ ను తన వైపు తిప్పుకుంటున్నాడు. ఫీల్డింగ్ లో ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన ఫిలిప్స్ తాజాగా వికెట్ల మధ్య ఎలా పరిగెత్తాలో నేర్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో రన్నింగ్ రేస్ స్టిల్ ఇస్తూ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ చివర్లో ఫిలిప్స్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రన్నింగ్ చేయడానికి బ్యాట్ క్రీజ్ లో పెట్టి పరుగు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కొట్టడమే ఆలస్యం నేను పరుగు పూర్తి చేస్తాను అన్నట్టుగా ఫిలిప్స్ పోజ్ ఇచ్చాడు.
ఫిలిప్స్ డెడికేషన్ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఫిలిప్స్ బ్యాటింగ్ లో దుమ్ము లేపాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూకుడుతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఈ టోర్నీలో ఫిలిప్స్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. రిజ్వాన్, కోహ్లీ క్యాచ్ లను పాయింట్ లో అందుకొని ఔరా అనిపించాడు.
ALSO READ | NZ vs SA: కేన్, రచీన్ సెంచరీలు: గడాఫీలో న్యూజిలాండ్ పరుగుల వరద.. సౌతాఫ్రికా ముందు బిగ్ టార్గెట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓపెనర్ రచీన్ రవీంద్ర (101 బంతుల్లో 108:13 ఫోర్లు, ఒక సిక్సర్) వెటరన్ ప్లేయర్ కేన్ విలియంసన్ (94 బంతుల్లో 102:10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచీన్ రవీంద్ర 108 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. రబడా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్డర్ కు ఒక వికెట్ దక్కింది.