Eng vs NZ: ఫిలిప్స్‌కే ఇలాంటివి సాధ్యం: సూపర్ మ్యాన్ తరహాలో స్టన్నింగ్ క్యాచ్

Eng vs NZ: ఫిలిప్స్‌కే ఇలాంటివి సాధ్యం: సూపర్ మ్యాన్ తరహాలో స్టన్నింగ్ క్యాచ్

న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ లో అద్భుతాలు చేయడం కొత్త కాదు. నమ్మశక్యం కాని క్యాచ్ లను ఎన్నో అందుకొని ఔరా అనిపించాడు. గ్రౌండ్ లో ఎక్కడున్నా బంతి వస్తే విన్యాసాలు చేస్తాడు. తాజాగా ఒక అద్భుతమైన క్యాచ్ తో ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. సింగిల్  హ్యాండ్ క్యాచ్ తో శెభాష్ అనిపించాడు. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ క్యాచ్ నమోదయింది. 

ఇన్నింగ్స్ 53 ఓవర్లో సౌథీ బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్లో సౌథీ వేసిన ఆఫ్ సైడ్ బంతిని పోప్ పాయింట్ దిశగా కట్ చేశాడు. ఈ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. గల్లీలో గోల్ కీపర్ లాగా ఎడమ వైపుకు ఎగిరి ఒక్క చేత్తో క్యాచ్ ను ఒడిసి పట్టాడు. క్యాచ్ అనంతరం ఫిలిప్స్ గర్జనతో తన సెలెబ్రేషన్ ను జరుపుకున్నాడు. పోప్ కు ఏం జరిగిందో అర్ధం కాక అక్కడే కాసేపు ఆగిపోయాడు. గతంలో ఇలాంటి తరహాలో  ఎన్నో అద్భుత క్యాచ్ లు అందుకున్న పోప్.. మరోసారి తన ఫీల్డింగ్ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. 

ALSO READ | ఆసీస్‌ జట్టులో బ్యూ వెబ్‌‌‌ స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ తో పోప్, బ్రూక్ మధ్య 151 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అప్పటివరకు అద్భుతంగా ఆడిన పోప్ పిలిప్స్ క్యాచ్ తో 77 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 348 పరుగులకు ఆలౌట్ అయింది. విలియంసన్ 93 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.