Ravanasura: రవితేజ పుట్టినరోజు కానుకగా రావణాసుర గ్లింప్స్

Ravanasura: రవితేజ పుట్టినరోజు కానుకగా రావణాసుర గ్లింప్స్

మాస్ మాహారాజా రవితేజ ధమాకా హిట్ తర్వాత రాబోతున్న సినిమా రావణాసుర. చిత్ర బృందం ఇవాళ రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని ‘రావణసుర’ ఫస్ట్ గ్లింప్స్‌, పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా స్వామిరార ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.  సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో సుశాంత్, అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్క్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.