
- ఇయ్యాల్టి నుంచి రెండ్రోజులు నిర్వహణ
- ప్రారంభించనున్న గవర్నర్ తమిళిసై
మాదాపూర్, వెలుగు : కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో ఇయ్యాల్టి నుంచి రెండు రోజులు గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జేఎన్టీయూ ఓల్డ్ స్టూడెంట్లను ఆహ్వానించడం, వర్సిటీతో చదివిన రోజులను గుర్తు చేసుకోవడం మీట్లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత స్టూడెంట్లకు, ఓల్డ్ స్టూడెంట్లకు విజయాలను తెలియజేయడం ఉంటుందని చెప్పారు.
5 నెలల వ్యవధిలో 1,600 మంది ఓల్డ్ స్టూడెంట్లు రిజిస్ర్టేషన్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ తమిళిసై శుక్రవారం ఉదయం10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తారని ప్రసంగిస్తారన్నారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సెమినార్ హాల్, హెల్త్‌సెంటర్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్, రెనోవేషన్ చేసిన కృష్ణ హాస్టల్‌ను ఓపెన్ చేస్తారని తెలిపారు.
రెండో రోజు శనివారం కల్చరల్, స్పోర్ట్స్ ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. జేఎన్టీయూ ఈఈఈ 1971 బ్యాచ్‌కు చెందిన లోహియా ఎడిబల్ఆయిల్ ప్రై. లి కంపెనీ చైర్మన్ కన్హయ్యలాల్ లోహియా అలుమ్ని ఫౌండేషన్‌కు రూ. కోటి రూపాయల ఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ గోవర్ధన్, రిజిస్ర్టార్ మంజూర్ హుస్సేన్ ఉన్నారు.