- భూమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్, రసాయన ఎరువులు, జంతువుల వ్యర్థాల కారణంగా 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40 శాతం పెరిగాయని గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పేర్కొంది.
- 15 దేశాల్లోని 55 సంస్థలకు చెందిన 58 మంది పరిశోధకుల బృందం గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పేరుతో రూపొందించిన నివేదికలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా దేశాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్గారాలు విడుదలయ్యే దేశాల జాబితాలో తొలి 10 స్థానాల్లో ఉన్నాయి.
- కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ భూమిని వేడెక్కిస్తున్న గ్రీన్ హైస్ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్ కూడా ఉంది.
- పారిశ్రామికీకరణ కంటే ముందు కాలంతో పోలిస్తే భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగింది. ఇందులో మానవ చర్యలతో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీల సెల్సియస్‌గా అంచనా వేస్తున్నారు.
- గడిచిన దశాబ్ద కాలంలో వాతావరణంలోకి చేరిన ఈ వాయు ఉద్గారాల్లో 74 శాతం నత్రజని ఎరువులు, వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఎరువుల నుంచే వచ్చాయి.
- 2022లో వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ గాఢత 336 పార్ట్స్ పర బిలియన్కు పెరిగింది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే ఇది 25 శాతం అధికం.
- భూతాపంలో పెరుగుదలను రెండు డిగ్రీలసెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేయాలంటే 2019 నాటితో పోలిస్తే 2050 నాటికి మానవ చర్యలతో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు కనీసం 20 శాతం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచించారు.