కరోనా పంజా.. 13 లక్షలు దాటిన మరణాలు

కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతుంది. నిన్నటి (నవంబర్14) వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  5 కోట్ల 31లక్షల 8 వేల 841 కు చేరాయి. మృతుల సంఖ్య 13 లక్షలు దాటింది. ప్రస్తుతానికి కోవిడ్ మరణాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల18 వేల 44 కు చేరాయి.  అత్యధికంగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య  కోటి 12 లక్షల 26 వేల 38  కి చేరగా మరణాల సంఖ్య 2,51,256 కు చేరింది. మరణాల్లో 1,65,673 తో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉండగా..1,29,674 తో భారత్ మూడవ స్థానంలో ఉంది. కరోనా కేసుల్లో  భారత్  88,14,902 కేసులతో రెండవ స్థానంలో ఉంది. 58,48,959 కేసులతో బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 78 లక్షల 66 వేల 891 మంది రికవరీ అయ్యారు. ఇంకా  కోటి 51లక్షల 33 వేల906 మంది ఆస్పత్రిలో ఉన్నారు.

టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్

సరిహద్దులో జవాన్ల దీపావళి వేడుకలు