పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే అయినా దానిని మితిమీరి వినియోగించడం ప్రమాదకరమని ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కీతిక సంస్థ (యునెస్కో) తెలిపింది. ఈ సంస్థకు చెందిన ప్రపంచ విద్యా పర్యవేక్షణ విభాగం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(జెమ్) విద్యలో సాంకేతికత అనే అంశానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మొబైల్ డివైజ్లతో ఎక్కువ సమయం గడపడం విద్యార్థి దృష్టి మరల్చుతుందని, వారి అభ్యర్థనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని జెమ్ తెలిపింది.
టెక్నాలజీపైనే తీవ్ర దృష్టి పెట్టడమనేది భారీ మూల్యం చెల్లించుకోవడమేనని, అభ్యసన ప్రక్రియకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తరగతి గదుల్లో వినియోగించాలని యూఎన్ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలోనే దాదాపు 14 దేశాలు పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయని పేర్కొంది.