గ్లోబల్​ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025​

గ్లోబల్​ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025​

గ్లోబల్​ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025 ఎనిమిదో ఎడిషన్​ ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో జరిగింది. 

థీమ్: ఇండియా యాజ్​ఏ టాప్​ ఏరోస్పేస్​ సప్లయ్​ చైన్​

ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పారిశ్రామికరంగం, పర్యాటకం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్​లు, వ్యవసాయం, ట్రాన్స్​ పోర్ట్​ అండ్​ లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్ ​రంగాల్లో పెట్టుబడులు అధికంగా తీసుకురావాలని నిర్ణయించారు. మధ్యప్రదేశ్​ను పెట్టుబడి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో 18 కొత్త పారిశ్రామిక విధానాలను ఆవిష్కరించారు. 
    
దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులను చర్చించడానికి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, విధాన రూపకర్తలు సమావేశమై గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సమ్మిట్​లో చర్చించారు. 

సమ్మిట్​ ఉద్దేశం: సాంకేతికత, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. తొలి గ్లోబల్​ ఇన్వెస్టర్స్ సమ్మిట్​2007లో జరిగింది.