హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొండాపూర్‌లో నవీకరించిన స్టోర్‌ను శనివారం తిరిగి ప్రారంభించింది. నటి పూనమ్ కౌర్, సంస్థ ఎండీ యోగేష్ ముద్రాస్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఎక్కువ స్థలం, విలాసవంతమైన వాతావరణం, అత్యుత్తమ ధరలు, భారీ కలెక్షన్ స్టోర్ప్రత్యేకతలని మలబార్ తెలిపింది. ప్రారంభ ఆఫర్లో భాగంగా, స్టోర్ వినియోగదారులకు ప్రతి కొనుగోలుతో పాటు వెండి నాణేలను ఉచితంగా అందిస్తారు.
ఈ నెల 23 వరకు ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. గోల్డ్, వజ్రాలు, పోల్కీ, విలువైన రత్నాలు, వెండి, ప్లాటినం నగలను ఇక్కడ కొనుక్కోవచ్చు. మైన్ డైమండ్ జ్యువెలరీ, ఎరా అన్‌కట్ డైమండ్ జ్యువెలరీ, డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ, ఎథ్నిక్స్ హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యువెలరీ, ప్రెసియా జెమ్‌స్టోన్ జ్యువెలరీ, విరాజ్ పోల్కీ జ్యువెలరీ వంటి బ్రాండ్లు ఈ స్టోర్‌లో ఉన్నాయి.