భారత ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడో ఏడాది కూడా ఆయనే ప్రపంచ నెంబర్ వన్ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా భారత ప్రధాని మోడీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అధిగమించి మరోసారి మోదీ టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. ఈ సర్వేలో మొత్తం 72 శాతం మంది మోడీకే ఓటేశారు. మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకులో నిలిచారు.
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు 47 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఐదో స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షూల్జ్ (42%) నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మందే ఓటేశారు. అయితే 21 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించారు. మరో 7 శాతం మంది తమకేం తెలియదంటూ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్
ఈ రూల్స్ అతిక్రమిస్తే అక్రిడేషన్ తొలగిస్తాం