గ్లోబల్స్మార్ట్ఫోన్బ్రాండ్ వివో మనదేశంలో వీ40, వీ40 ప్రో ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. జైస్ లెన్స్ కెమెరాలు, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీలు, 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజీ, 50 ఎంపీ సెల్ఫీ కెమెరాలు, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్వంటి ప్రత్యేకతలు వీటి సొంతం. రెండు ఫోన్లు ఈనెల 13 నుంచి అమ్మకానికి వస్తాయి. ధరలు రూ.35 వేల నుంచి రూ.56 వేల వరకు ఉంటాయి.