Game Changer Trailer: ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్: ‘నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయేంత వరకూ ఐఏఎస్..’

Game Changer Trailer: ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్: ‘నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయేంత వరకూ ఐఏఎస్..’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈరోజు గురువారం జనవరి 2న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూసేద్దాం..తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. రామ్ చరణ్ లుక్స్, మేనరిజం అద్ధిరిపోయాయి.

మొదటగా సైలెంట్ బీజీయంతో "కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చే నష్టమేమీ లేదు" అంటూ  రామ్ చరణ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని పొలిటికల్ సీన్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రామ్ చరణ్  కి తప్ప ఇతర క్యాస్ట్ అండ్ క్రూ కి పెద్దగా డైలాగ్స్ లేవు.. 

కానీ ట్రైలర్ లో నటీనటులకు స్కోప్ ఇచ్చాడు. దీంతో ఎస్జె సూర్య, శ్రీకాంత్ తదితరులు తమ గెటప్స్ తో పాటు డైలాగ్స్ తోను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎస్జే సూర్య కూడా తన పవర్ఫుల్ యాక్టింగ్ తో అలరించాడు. సరిపోదా శనివారంతో యాంగ్రీ కాప్ పాత్రలో కనిపించిన ఎస్జే సూర్య ఈసారి గేమ్ ఛేంజర్ పొలిటీషియన్ పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, కాలేజ్ స్టూడెంట్, రైతు, మాస్ లుక్స్ ఇలా రకరకాల గెటప్స్ లో కనిపించాడు. చివరిలో 'నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్.. నేను లైఫ్ లాంగ్ ఐఎస్ ఆఫీసర్" అని చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది.

మేకింగ్ విషయంలో శంకర్ తన మార్క్ చూపించాడు.  గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు, భారతీయుడు సినిమా ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  ఇక తమన్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించాడని చెప్పవచ్చు. మొత్తానికి పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచేసింది. మరి ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న గేమ్ ఛేంజర్ థియేటర్స్ లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.

ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ భారీ హైప్ ఇచ్చాయి. ఇపుడు ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పండుగనే చెప్పాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.