మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విగ్రహం

2022లో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1300 కోట్లు (గ్రాస్) వసూలు  చేసి టాలీవుడ్ లోనే అత్యధిక  కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. అంతేగాకుండా పలు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుంది.

ALSO READ | ఆ దర్శకుడితో సినిమా చెయ్యాలని ఉందంటున్న కల్కి చిత్రం నిర్మాత..

అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ప్రతిభ కనబర్చినందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మరియు అతడి పెంపుడు జంతువు అయిన రైమ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వీడియో వైరల్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కోలీవడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ చిత్రంలోని సెకెండ్ సింగిల్ రా మచ్చా సాంగ్ ప్రోమో ని యూట్యూబ్ లో విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.