డల్‌‌‌‌‌‌‌‌గా ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌! కానీ ఇలా కూడా జరగొచ్చు..

డల్‌‌‌‌‌‌‌‌గా ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌! కానీ ఇలా కూడా జరగొచ్చు..

ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను  గ్లోబల్ అంశాలు, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల కదలికలపై ఆధారపడి ఉంటుందని   ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ కారణంగా ఈ నెల 25 న మన మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సెలవు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లకు కూడా ఈ వారం రెండుమూడు రోజుల పాటు హాలిడే. దీంతో మార్కెట్ డల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌గా పెద్ద ఈవెంట్స్ ఏం లేవు. కానీ, యూఎస్ బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌, డాలర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ కదలికలు, యూఎస్ జాబ్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్స్ డేటా వంటివి ఇండియన్ మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రవీష్ గౌర్ అన్నారు.

వోలటాలిటీ ఎక్కువగా ఉన్న ప్రస్తుత  టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించొచ్చు. కానీ,  ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐ) అమ్మకాలు కొనసాగుతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతోంది’ అని అభిప్రాయపడ్డారు. కిందటి వారం సెన్సెక్స్ ఏకంగా 5 శాతం (4,092 పాయింట్ల) పతనమవ్వగా, నిఫ్టీ 4.76 శాతం (1,181 పాయింట్లు) నష్టపోయింది.  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు సడెన్‌‌‌‌‌‌‌‌గా  ‘కొనడం నుంచి అమ్మడానికి’ తమ స్ట్రాటజీని మార్చడంతో మార్కెట్ భారీగా పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.

రూ.976 కోట్లు అమ్మిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు..

వరుసగా రెండు వారాల పాటు నికర కొనుగోలుదారులుగా మారిన  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు, కిందటి వారం మాత్రం నికరంగా రూ.976 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. యూఎస్ డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాండ్‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు పెరగడమే ఇందుకు కారణం. ఈ వారం (డిసెంబర్ 16–20) ప్రారంభంలో  నికరంగా రూ.3,126 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, చివరిలో రూ.4,102 కోట్ల షేర్లను అమ్మారు.