మొక్కలు సక్కగ పెరుగుతలేవు

మొక్కలు సక్కగ పెరుగుతలేవు
  • 1999 నుంచి 59 శాతం తగ్గిన పెరుగుదల
  • గాలిలో నీటి ఆవిరి సరిగా లేకపోవడమే కారణం

ప్రపంచవ్యాప్తంగా మొక్కల పెరుగుదల తగ్గుతోందని సైంటిస్టులకు డౌటొచ్చింది. ‘క్లియర్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే పోలా’ అని పరిశోధన మొదలుపెట్టారు. ఏళ్లనాటి డేటాలను తీసి కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ మోడళ్లతో లెక్కలేశారు. వాటి పెరుగుదల విపరీతంగా తగ్గుతోందని తెలుసుకున్నారు. ముఖ్యంగా 1999 నుంచి 59 శాతం తగ్గిందని గుర్తించారు. వాతావరణంలో నీటి ఆవిరి సరిగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని కనుగొన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్‌‌‌‌‌‌‌‌ వల్లే ఈ పరిస్థితి ఎక్కువవుతోందని చెప్పారు.

గాలిలోని నీటికి, మొక్కల పెరుగుదలకు సంబంధమేంటని డౌట్‌‌‌‌‌‌‌‌ రావొచ్చు. మొక్కల ఫొటో సింథసిస్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ సరిగా జరగలాంటే వాతావరణంలో నీటి ఆవిరి ఉండాలి. ఈ కిరణజన్య సంయోగ క్రియతోనే మనకు కావాల్సిన పిండి పదార్థాలు, వాటికి కావాల్సిన శక్తిని మొక్కలు తయారు చేసుకుంటాయి. ఇందుకోసం కార్బన్‌‌‌‌‌‌‌‌ డై ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌, నీరు, సూర్యకాంతిని తీసుకుంటాయి. ఈ మొత్తం పరిశోధనను చైనాలోని సన్‌‌‌‌‌‌‌‌ యాట్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేశారు.

మొక్కల పెరుగుదలకు, వేపర్‌‌‌‌‌‌‌‌ ప్రెజర్‌‌‌‌‌‌‌‌ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ (వీపీడీ)కు సంబంధముందని సైంటిస్టులు చెప్పారు. వాతావరణంలో గాలి సంతృప్త స్థాయిలో ఉన్నప్పుడు నీటి ఆవిరి, గాలి కలుగజేసే పీడనాల మధ్య తేడానే వీపీడీ అంటారు. ఈ తేడా పెరుగుతుండటంతోనే మొక్కల పెరుగుదల తగ్గుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది మరీ తగ్గితే మొక్కల ఆకులపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయని, రంధ్రాలు క్లోజైతే కార్బన్‌‌‌‌‌‌‌‌ డై ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం, మొక్కల్లో ఎక్కువైన నీటి ఆవిరిని వదలడం ఉండదని వివరించారు. దీంతో ఫొటో సింథసిస్‌‌‌‌‌‌‌‌ రేటు తగ్గుతుందన్నారు. వీపీడీ కావాల్సిన స్థాయిలో ఉంటే మొక్కల నుంచి త్వరగా నీటి ఆవిరి బయటకు పోతుందని చెప్పారు. అయితే వీపీడీ మరీ ఎక్కువైతే గాలి ఉష్ణోగ్రత పెరిగి మొక్కలు చనిపోతాయని చెప్పారు. 20వ శతాబ్దం చివరన మొక్కలు ఎక్కువున్న ప్రాంతాల్లో ఇది ఎక్కువవుతుందని వివరించారు.