అమెరికా, యూరప్ దేశాల్లో కుతకుత

  • రికార్డ్ స్థాయిలో దంచికొడ్తున్న ఎండలు 
  • డెత్​ వ్యాలీలో శనివారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • గ్లోబల్ వార్మింగ్​ను కంట్రోల్ చేయకుంటే కష్టమేనంటున్న ఎక్స్ పర్ట్స్

రోమ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎండలు దంచి కొడ్తుండటంతో అమెరికా, యూరప్, జపాన్ దేశాలు కుతకుతా ఉడికిపోతున్నాయి. ఆయా దేశాల్లో టెంపరేచర్లు రికార్డ్ లు బద్దలుకొడ్తున్నాయి. ఎక్కడ చూసినా టెంపరేచర్లు 40 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. మరోవైపు నార్త్ ఇండియాలో ఎండలు దంచికొట్టిన తర్వాత ఇప్పుడు కుండపోత వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. 

ఇలా విపరీతమైన ఎండలు.. ఆ వెంటనే భీకరమైన వర్షాలు.. ప్రపంచానికి రెడ్ అలర్ట్ వంటిదని ఎక్స్ పర్ట్​లు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణంగా ఇలా వెంటవెంటనే వాతావరణం మారిపోతోందని అంటున్నారు. ఇప్పటికైనా గ్లోబల్ వార్మింగ్​ను కంట్రోల్ చేయకపోతే మున్ముందు అన్ని దేశాలకూ ఇదే పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు.

అమెరికా డెత్ వ్యాలీలో 54 డిగ్రీలు

 

అమెరికాలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో కాలిఫోర్నియా నుంచి టెక్సస్ వరకూ ఈ వారాంతంలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని, టెంపరేచర్లు సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీ ఫారెన్ హీట్స్ ఎక్కువగా నమోదు కావచ్చని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. అరిజోనా స్టేట్​లో ఎండ దెబ్బకు జనం బయట తిరిగేందుకు జంకుతున్నారు. 

ఈ స్టేట్ క్యాపిటల్ ఫీనిక్స్​లో శనివారం ఇది 46 డిగ్రీలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక వేడి ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఆదివారం గరిష్టంగా 54 డిగ్రీల సెల్సియస్​ టెంపరేచర్ నమోదు కావచ్చని వెదర్ సర్వీస్ పేర్కొంది.

ALSO READ :ఆటోమొబైల్ ఎగుమతులు 28% డౌన్​
 
శనివారం ఇక్కడ 48 డిగ్రీ సెల్సియస్​ల టెంపరేచర్ రికార్డ్ అయింది. హూస్టన్, లాస్ వెగాస్​లలోనూ హీట్ వేవ్స్ తీవ్రం అయ్యాయని, ఎండపూట జనం బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇక దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్క రివర్ సైడ్ కౌంటీలోనే 3 వేల ఎకరాల్లో కార్చిచ్చులు చెలరేగాయి. 

రోమ్​లో 43 డిగ్రీలకు..

యూరప్​లోని ఇటలీ సహా పలు దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోమ్​లో టెంపరేచర్లు సోమవారం నాటికి 43 డిగ్రీలకు చేరుతాయని వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. సిసిలీ, సార్డినియా ఐల్యాండ్స్​లో ఏకంగా 48 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. గ్రీస్​లోని ఏథెన్స్ సైతం ఎండలతో మండిపోతోంది. ఫ్రాన్స్​ చరిత్రలోనే అత్యధిక వేడి నెలగా  జూన్ రికార్డ్ అయింది. స్పెయిన్ లోనూ హీట్ వేవ్స్ తీవ్రం అయ్యాయి. 

జపాన్​లోనూ భారీగా టెంపరేచర్లు..

జపాన్ లోని తూర్పు ప్రాంతాల్లో సైతం టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆదివారం 38 డిగ్రీలు నమోదు కాగా, సోమవారం 39 డిగ్రీ సెల్సియస్ లకు చేరొచ్చని వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. 

కాగా, ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో దేశంలో సైతం గరిష్ట టెంపరేచర్లు 47 డిగ్రీలకు చేరాయి. జోర్డాన్​లోని అజ్లౌన్ ఫారెస్ట్​లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఈ దేశంలో హీట్ వేవ్స్ తో జనం అల్లాడుతున్నారు. అలాగే ఇరాక్ లో టైగ్రిస్ నది పూర్తిగా అడుగంటింది. బాగ్దాద్​లో ఏకంగా 50 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.