హైదరాబాద్, వెలుగు: వస్త్రాలు, కాటన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్, హోమ్ టెక్స్ టైల్స్, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ తయారీ సంస్థ గ్లోబ్ టెక్స్ టైల్స్ (ఇండియా) లిమిటెడ్ రూ.4,504 లక్షల విలువైన రైట్స్ ఇష్యూ తొలిరోజు 14.69 శాతం సబ్స్క్రయిబ్ అయింది.
ఈ ఇష్యూ జనవరి 24 న సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 6 న ముగుస్తుంది. జనవరి 24న షేరు ముగింపు ధర రూ.3.78తో పోలిస్తే రైట్స్ ఇష్యూ ధర రూ.మూడుగా ఉంది. రైట్స్ ఎంటైల్ నిష్పత్తిని 1:2గా నిర్ణయించారు.
అంటే రికార్డు తేదీ నాటికి (జనవరి 17, 2025) వాటాదారులు కలిగి ఉన్న ప్రతి రెండు ఈక్విటీ షేర్లకు ఒక ఈక్విటీ వాటాను పొందవచ్చు. రైట్స్ ఇష్యూలో రూ.2 ముఖ విలువ కలిగిన 15.01 కోట్ల ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను గ్లోబ్ డెన్ వాష్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి, అప్పులు తీర్చడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీర్చడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.