ఈ డివైజ్​ తో.. మీ పెట్స్ ఎక్కడున్నా మాట్లాడొచ్చు

ఈ డివైజ్​ తో.. మీ పెట్స్ ఎక్కడున్నా మాట్లాడొచ్చు

మొబైల్​ వరల్డ్ కాంగ్రెస్​ 2025లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల టెక్నాలజీలు ఆశ్చర్యపరుస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్​ను ఈ వేదికపై లాంచ్​ చేస్తున్నాయి. అందులో భాగంగానే గ్లోకల్​మీ అనే కంపెనీ కూడా తనదైన స్టైల్​లో ప్రొడక్ట్​ను లాంచ్​ చేసింది. ఆ ప్రొడక్ట్ చూసినవాళ్లంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ అదేంటంటారా.. పెంపుడు జంతువుల కోసం  ‘పెట్​ ఫోన్​’ అనే డివైజ్​ను ఆవిష్కరించింది. 

ఇది క్లౌడ్​ సిమ్​ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇది డస్ట్​, వాటర్​ ప్రూఫ్​. ఈ పెట్ ఫోన్​ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసేలా డిజైన్​ చేశారు. ఇది టూ వే కమ్యూనికేషన్ అందిస్తుంది. దీంతో ఈ డివైజ్​ ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా వాటితో టచ్​లో ఉండొచ్చు. సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెట్ ఉన్నా కూడా లొకేషన్​ కరెక్ట్​గా చూపిస్తుంది. అంతేకాదు మీ పెట్ ఏం చేస్తోందో కూడా ఈ డివైజ్​ గుర్తించగలదు. రియల్​ టైం లొకేషన్​ ట్రాక్ చేయగలదు. 

జీపీఎస్, వైఫై, బ్లూటూత్​ వంటి ఫీచర్లతో మీ పెట్​ని ట్రాక్ చేయొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. ఈ పెట్​ ఫోన్​కి ఏఐ టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. దీంతో పెంపుడు జంతువు మూడ్​ అంచనా వేయొచ్చు. ఉదాహరణకు.. పెట్​ చేసే రకరకాల శబ్డాలను గుర్తించి, డివైజ్​కు కనెక్ట్ చేసిన వ్యక్తులను అలర్ట్​ చేస్తుంది. ఇంకా ‘పా టాక్’ అనే ఫీచర్ ద్వారా మీ పెట్​తో డైరెక్ట్​గా మాట్లాడొచ్చు. అది ఎటు వెళ్తుందో తెలుసుకోవచ్చు. సౌండ్ ప్లే ఆప్షన్స్​తో పెట్​ను ఓదార్చే విధంగా టెక్నాలజీని డిజైన్ చేశారు.