
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలం నార్సింగి గ్రామం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం నార్సింగి శివారులోని దారిదేవుడి ఆలయం వద్ద ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్సింగి నుంచి ఆలయం వరకు శివపార్వతుల పల్లకీ సేవ చేపట్టారు.
అనంతరం శివస్వాములు 108 కళాశాలతో శివ లింగానికి జలాభిషేకం చేశారు. 12 జ్యోతిర్లింగాల పడి మెట్లపై ఒక్కొక్క హారతి కర్పూరం వెలిగిస్తూ పూజ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద శంకరంపేట, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, కౌడిపల్లి, మెదక్, సదాశివపేట మండలాల నుంచి 400 మంది శివస్వాములు పాల్గొన్నారు.