కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్పొరేట్ ఏరియాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జీఎంలను ట్రాన్స్ఫర్ చేస్తూ శనివారం ఆర్డర్స్ వెలువడ్డాయి. కార్పొరేట్ జీఎం అయినాల రవికుమార్‌ను క్వాలిటీ మేనేజ్మెంట్కు, ఎన్విరాన్ మెంట్ జీఎం ఎ.మనోహర్‌ను సీపీఅండ్‌పీ విభాగానికి, క్వాలిటీ మేనేజ్మెంట్ జీఎం.నారాయణరావును ఆర్‌అండ్‌డీకి, ఆర్అండ్డీ జీఎం బానోత్ సైదులును ఎన్విరాన్మెంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఎంపీ జీఎం ఎం.విజయ్‌భాస్కర్‌రెడ్డిని సీఎంసీ డిపార్ట్మెంట్కు, జీఎం బత్తుల శ్రీనివాస్‌రావు ఐఅండ్పీఆర్కు బదిలీ అయ్యారు.
బెల్లంపల్లి ఏరియా గోలేటీ ఓసీపీ డిప్యూటీ జీఎం నాయని ఉమాకాంత్ బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా, శ్రీరాంపూర్ ఏరియా టింబర్ యార్డ్ అడిషనల్ మేనేజర్ సల్ల జక్కారెడ్డిని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా, శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ మురళీమోహన్ను భూపాలపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా, భూపాలపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవిని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ ఓసీపీ 2 మైన్‌కు ట్రాన్స్ఫర్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
12న దసరా సెలవు
సింగరేణి ఉద్యోగులకు ఈ నెల 12న దసరా సెలవును ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగులకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది.