లండన్ : తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. డబ్ల్యూఆర్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అర్జున్ 69 ఎత్తుల వద్ద మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. దీంతో తన ఎలో రేటింగ్‌ను 2796కు పెంచుకున్నాడు. క్లాసికల్ చెస్‌లో భాగంగా జరిగిన ఫైనల్ పోరులో అర్జున్ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. కానీ తెల్లపావులతో రెండో గేమ్‌లో సిసిలియన్ నజ్‌డార్ఫ్ వ్యూహంతో వాచిర్ లాగ్రెవ్‌కు చెక్ పెట్టాడు.
21వ ఎత్తు వద్ద గేమ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న అర్జున్ చకచకా పావులు కదుతుపు వాచిర్ వాగ్రెవ్‌ను కట్టడి చేశాడు. మూడో గేమ్‌లో అర్జున్ పెట్రాఫ్ డిఫెన్స్‌తో ముందుకెళ్లాడు. కానీ వాచిర్ లాగ్రెవ్ రెండు మైనర్ పావులను కోల్పోయి అర్జున్ కింగ్‌కు చెక్ పెట్టాడు. అయినా తెలుగు గ్రాండ్ మాస్టర్ క్వీన్‌ను కోల్పోయి 69వ ఎత్తు వద్ద గేమ్‌ను నెగ్గాడు.