
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం చేయడమే గొప్ప అవకాశమని, విధులకు గైర్హాజరై డిస్మిస్ కావొద్దని జీఎం చింతల శ్రీనివాస్ కార్మికులకు సూచించారు. ఆర్జీ 1 ఏరియాలో 138 మంది గైర్హాజరు కార్మికులకు శుక్రవారం స్థానిక ఆర్‌సీవోఏ క్లబ్ ఆవరణలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు పోగొట్టుకొని కుటుంబాలను ఆగం చేయొద్దన్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా ఏడాదిలో 100 రోజులకు పైగా డ్యూటీ చేయాలని సూచించారు. మూడేండ్లపాటు సరిగా డ్యూటీ రానివారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.