ఆర్జీ 1 ఏరియాలో 150 శాతం ఉత్పత్తి : చింతల శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు: సమష్టి కృషితో సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో 150 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు జీఎం చింతల శ్రీనివాస్​ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్జీ 1 ఏరియాలో మార్చి నెలలో  4,01,300 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గానూ 6,01,779  టన్నులతో ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. అదే విధంగా 2023–-24 సంవత్సరానికి గానూ ఆర్జీ 1 ఏరియాకు 43,80,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 44,95,256 లక్షల టన్నులతో 103 శాతం ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు.

జీడీకే ఓసీ 5 ప్రాజెక్ట్​కు నిర్ధేశించిన లక్ష్యాలను గడువుకు 29 రోజుల ముందే సాధించడం గొప్ప విశేషమన్నారు. చివరి 5 రోజులలో బొగ్గు రవాణాలో రికార్డు సాధించినట్లు చెప్పారు. సీఎండీ ఎన్​.బలరామ్​ ఆదేశాల మేరకు ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు తిలక్​నగర్​ డౌన్ లోని సింగరేణి స్కూల్ పాత భవనంలో స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్​ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ఆర్జీ3లో 134  శాతం ఉత్పత్తి 

రామగిరి,  వెలుగు: మార్చి నెలలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వివరాలను ఆర్జీ -3 ఏరియాలో జీఎం ఎన్‌‌‌‌.సుధాకర్‌‌‌‌‌‌‌‌రావు వెల్లడించారు. ఆర్జీ3 ఏరియాకు నిర్దేశించిన 5.50 లక్షల టన్నులకు గానూ, 7.36 లక్షల టన్నులతో 134 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు  50.57 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసి 99 శాతం సాధించినట్లు చెప్పారు.

సీహెచ్‌‌‌‌పీ నుంచి 9.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు. అదేవిధంగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాకు 1.39 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గానూ, 1.52 లక్షల టన్నుల ఉత్పత్తితో 109 శాతం సాధించినట్లు చెప్పారు. రామగుండం-3  ఏరియాకు 2023–20-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 55  లక్షల టన్నులకు గానూ 107 శాతంతో 59.11 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.