సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలి :  జీఎం జి.దేవేందర్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో మెడికల్​ఇన్​వాలిడేషన్​ ద్వారా డిపెండెంట్​ఉద్యోగాలు దక్కించుకున్న యువతీయువకులు సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​అన్నారు. గురువారం జీఎం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిపెండెంట్లకు జాయినింగ్​ఆర్డర్స్​ను ఆయన అందజేశారు. ఏరియా పరిధిలో ఇప్పటి వరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం రిపబ్లిక్​డే వేడుకల నిర్వహణపై హెడ్​ ఆఫ్​ ది డిపార్ట్​మెంట్ల బాధ్యులతో జీఎం సమావేశమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్, కేకే గ్రూప్​ఏజెంట్​రాందాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ రవీందర్,  డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.