
బాకు (అంజర్‌బైజాన్) : ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో ఇండియా జీఎం ఆర్. ప్రజ్ఞానంద, అమెరికా స్టార్ ఫబియానో కరువానా మధ్య సెమీఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. ఆదివారం జరిగిన రెండో క్లాసికల్ గేమ్ కూడా డ్రా అయింది.
దాంతో 1-1తో సమంగా ఉన్న ఇరువురూ సోమవారం ర్యాపిడ్ టై బ్రేక్స్‌లో పోటీ పడతారు. మరోవైపు తొలి గేమ్‌లో నెగ్గి రెండో గేమ్‌లో లోకల్ ప్లేయర్ అబసోవ్‌తో డ్రా చేసుకున్న కార్ల్‌సన్ ఫైనల్ చేరాడు.