న్యూఢిల్లీ: ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్లు జీమెయిల్ సరిగ్గా పని చేయడం లేదని వాపోతున్నారు. తమ జీమెయిల్ అకౌంట్స్‌ను లాగ్ ఇన్ చేయలేకపోతున్నామని, మెయిల్స్‌ను పంపలేకపోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై గూగుల్ ఓ మెసేజ్ పెట్టింది. త్వరలోనే ఈ ఫీచర్‌ను పరిష్కరిస్తామని. టైమ్ ఫ్రేమ్ మారొచ్చని సర్వీస్ స్టేటస్ పేజ్‌లో అప్‌డేట్ చేసింది. ‘ఈ సమస్యను పరిష్కరించడానికి మా టీమ్ కష్టపడుతోంది. ఈ ప్రాబ్లమ్‌పై త్వరలోనే మరింత సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాం. మీ ఓపికకు కృతజ్ఞతలు’ అని గూగుల్ నోట్స్ తన సర్వీస్ స్టేటస్ పేజ్‌లో మెసేజ్ చేసింది.
జీమెయిల్‌తోపాటు గూడుల్ డ్రైవ్‌లో కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని పలువురు యూజర్లు ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. పాపులర్ వెబ్ సర్వీసులైన జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌తోపాటు మరిన్ని గూగుల్ సర్వీసులు ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు మరికొన్ని దేశాల్లో సరిగ్గా పని చేయడం లేదని సమాచారం. ఇండియాలో ఈ సమస్య ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలైందని తెలిసింది. జీమెయిల్ నుంచి దాదాపు 62 శాతం మంది యూజర్లు అటాచ్‌మెంట్స్‌ను సెండ్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.