2031 నాటికి 50 కోట్ల మంది ప్యాసింజర్లు.. కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ భారీ పెట్టుబడులు

2031 నాటికి 50 కోట్ల మంది ప్యాసింజర్లు.. కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ భారీ పెట్టుబడులు

హైదరాబాద్​: 2031 నాటికి హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ప్రయాణించే వారి సంఖ్య ఏటా ఐదు కోట్లు దాటుతుందని దీని నిర్వహణ సంస్థ జీఎంఆర్​గ్రూప్ ​ప్రకటించింది. 2025లో దాదాపు 2.9 కోట్ల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నట్టు తెలిపింది. కార్గో టెర్మినల్​ విస్తరణకు రూ.370 కోట్లు ఇన్వెస్ట్ ​ చేస్తామని జీహెచ్ఐఏల్​ సీఈఓ ప్రదీప్​ పాణికర్​చెప్పారు. 

ఏటా నాలుగు లక్షల టన్నుల సరుకు రవాణా చేసే కొత్త టెర్మినల్​ను కూడా నిర్మిస్తామని చెప్పారు. మనదేశంలోని మెట్రో ఎయిర్​పోర్టుల్లో అత్యధిక వేగంగా గ్రోత్​ సాధిస్తున్నామని, గత ఏడాది 2.5 కోట్ల మందికి సేవలు అందించామని చెప్పారు.

దశల వారీగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ఎయిర్​పోర్టులో సదుపాయాలను పెంచుతామని ప్రదీప్ ​వెల్లడించారు. హైదరాబాద్​ ఎయిర్​పోర్టును 2008లో 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించారు. గత క్యాలెండర్​సంవత్సరంలో కొత్త ప్రయాణికుల సంఖ్య 36 లక్షలు పెరిగింది.

ప్రస్తుతం రన్​వేపై గంటకు 35 వరకు విమానాలు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉందని, దీనిని 42కు పెంచుతామని సీఈఓ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సంలో జీహెచ్​ఐఏల్​కు రూ.2,700 కోట్ల ఆపరేషనల్ ​రెవెన్యూ వచ్చిందన్నారు.