![GMR కొత్త ప్రాజెక్ట్ ..1500 ఎకరాలలో ఏరోసిటీ](https://static.v6velugu.com/uploads/2021/04/GMR-Group-launches-AeroCity-spread-over-1,500-acres-around-Hyderabad-Airport_StEaXsCMoh.jpg)
జీఎంఆర్ గ్రూప్ 1500 ఎకరాల ఏరియాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఏరోసిటీ ప్రాజెక్టును లాంఛ్ చేసింది. బిజినెస్ పార్కు, రిటెయిల్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ పార్కులు ఇందులో ఉంటాయి. లీజుకు ఇచ్చేందుకు 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అందుబాటులోకి తేనున్నట్లు జీఎంఆర్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం నాలుగు టవర్లు ఉంటాయని పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు తరహాలోనే గ్రేడ్ ఏ ఆఫీసెస్ స్పేస్ ఇక్కడ అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు పెద్ద పీట వేస్తున్నామని, భాగస్వాములు ఈజీగా తమ వ్యాపారాలు సెట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇన్ఫ్రా, ఫెసిలిటీస్, సెక్యూరిటీల గురించి భాగస్వాములు ఆలోచించాల్సిన అవసరమే ఉండదని జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్ కపూర్ చెప్పారు. లైఫ్‌స్టైల్ డెస్టినేషన్ రిటెయిల్ ప్రాజెక్టు జీఎంఆర్ ఇంటర్‌ఛేంజ్‌కు కూడా రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సినిమా, ఫ్యామిలీ ఎంటర్టెయిన్మెంట్ సెంటర్ ఇందులో భాగంగా ఉంటాయన్నారు. హాస్పిటాలిటీ డిస్ట్రిక్ట్నూ తలపెడుతున్నామని కపూర్ చెప్పారు. ఫుడ్ కోర్ట్, జిమ్నాజియం, రిటెయిల్ బ్యాంక్ బ్రాంచ్, హెల్త్ సెంటర్లతోపాటు, ఎయిర్పోర్ట్ పబ్లిక్ ప్లాజాలు ఎంప్లాయీస్ అవసరాలను నెరవేరుస్తాయని పేర్కొన్నారు.