ఐపీఓకు జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ రెడీ

 ఐపీఓకు జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్ రెడీ

న్యూఢిల్లీ: ఇనీషియల్​పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా నిధులను సేకరించేందుకు జీఎన్‌‌జీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది.  ఈ ఐపీఓలో ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూతో పాటు రూ. 825 కోట్ల విలువైన ఓఎఫ్‌ఎస్​ ఉంటుంది. ప్రమోటర్ల ద్వారా 97 లక్షల ఈక్విటీ షేర్లు అమ్మకానికి వస్తాయి. 

ఓఎఫ్​ఎస్​లో శరద్ ఖండేల్వాల్,  విధి శరద్ ఖండేల్వాల్​ 35వేల షేర్ల చొప్పున,  అమియబుల్ ఎలక్ట్రానిక్స్ ద్వారా 96.30 లక్షల షేర్లు అమ్మకానికి వస్తాయి.  తాజా ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తం రూ. 320 కోట్లను అప్పుల చెల్లింపు కోసం, రూ. 260 కోట్లను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన మొత్తం సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.   కంపెనీ "ఎలక్ట్రానిక్స్ బజార్" బ్రాండ్ క్రింద పనిచేస్తుంది.