తెలంగాణలో జీఎన్‌‌ఎం కోర్సు

తెలంగాణలో జీఎన్‌‌ఎం కోర్సు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-–24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్‌‌ మిడ్‌‌వైఫరీ(జీఎన్‌‌ఎం) ట్రైనింగ్ కోర్సులో అడ్మిషన్స్​కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్‌‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌‌ 16వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు.

అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్‌‌ ఒకేషనల్(ఏఎన్‌‌ఎం/ హెల్త్‌‌ కేర్‌‌ సైన్స్‌‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. 
అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. వివరాలకు www.dme.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.