జగిత్యాల టౌన్, వెలుగు: గో ఆధారిత వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతికతలో రైతులకు శిక్షణ తరగతులను మాధవసేవ పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామంలోని సురభి గోశాలలో ఆదివారం నిర్వహించారు.
టీసీబీటీ (తారా చంద్ బెల్జి టెక్నిక్), సీవీఆర్ పద్ధతి, సుభాష్ పలేకర్ పద్ధతి, కూరగాయల నూతన విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. దాదాపు 200 వందల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన పొందారు. గోవుకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమం సురభి గోశాల అధ్యక్షులు రాజారెడ్డి, ట్రస్ట్ అధ్యక్షులు శంకర్, ప్రసాద్ జీ, సునంద, నాగేందర్ రెడ్డి, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.