నామినేషన్​ వేసేందుకు గాడిదతో వెళ్లిండు​

నిరుద్యోగుల పట్ల కేసీఆర్​ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఓ నిరుద్యోగి వినూత్న నిరసన తెలిపాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పుట్ట భాస్కర్​ అనే నిరుద్యోగి సోమవారం లుంగి కట్టుకొని, బనియన్ తో నామినేషన్ ​వేయడానికి వెళ్తూ గాడిదను వెంట తీసుకువెళ్లాడు. అనుమతి లేదని పోలీసులు ముందే నిలిపేశారు. చేసేది లేక అతను ఒక్కటే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ ​వేశాడు.  బీఆర్ఎస్ ప్రభుత్వం​ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, పేపర్ లీకేజీలతో లక్షల మంది రోడ్డున పడ్డారని భాస్కర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

-  బాన్సువాడ, వెలుగు