
- మెదక్ బీజేపీ ప్రచార సభలో గోవా సీఎం ప్రమోద్ సావంత్
- హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై తిరగబడండి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
మెదక్, వెలుగు : లూటీ సర్కార్లను ఇంటికి పంపాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్పిలుపునిచ్చారు. తెలంగాణను పదేండ్లు బీఆర్ఎస్దోచుకుంటే, ఇపుడు కాంగ్రెస్దోచుకుంటోందన్నారు. మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్సందర్భంగా గురువారం రాత్రి మెదక్‌లో ర్యాలీ నిర్వహించి శివాజీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభ నిర్వహించారు. ప్రమోద్సావంత్మాట్లాడుతూ డబ్బులు కలెక్ట్ చేసే కలెక్టర్వెంకట్రాంరెడ్డిని ఎమ్మెల్సీ చేసిన బీఆర్ఎస్ ఇపుడు మరింత ఎక్కువ కలెక్షన్చేసేందుకు ఎంపీ టికెట్ఇచ్చిందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్ కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్నాయకులపై తిరగబడాలని, ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు. రాహుల్ ప్రధాని కావడం కల అని, ఆయన ఇంకా ఇరవై ఏండ్లు కాంగ్రెస్లీడర్గా ఉంటే బీజేపీకి మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోవడానికి పదేండ్లు పట్టిందని, కానీ, కాంగ్రెస్ సర్కారు పోవడానికి చాలా తక్కువ టైం పడుతుందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్తన కూతురు నీతిమంతురాలని సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావ్మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి కులాన్ని, బీఆర్ఎస్అభ్యర్థి సూట్‌కేసులను నమ్ముకుని ఎన్నికల్లో పోటీకి వస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా హరీశ్‌రావ్, వెంకట్రామిరెడ్డిలకు మల్లన్నసాగర్ముంపు గ్రామాల్లో పర్యటించే దమ్ముందా అని ప్రశ్నించారు. ‘దుబ్బాకలో చెల్లని రఘునందన్‌రావ్, మెదక్లోక్సభ ఎన్నికల్లో ఎలా చెల్లుతాడని మాజీ మంత్రిహరీశ్రావ్అంటున్నారు. నీ మామను రమ్మను మెదక్ లో పోటీ చేసేందుకు... ఛత్రపతి శివాజీ సాక్షిగా గోరీ కట్టకపోతే నేను రఘురాముడి వారసుడినే కాదు' అని అన్నారు. బీజేపీ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, గోదావరి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.