పబ్లో అమ్మాయిని గిల్లిన పోలీస్ డీఐజీ..వీడియో వైరల్

రక్షక భటులు అంటే ప్రజలను రక్షించేవారు..ప్రజలకు రక్షణగా నిలిచేవారు అని అర్థం. అందుకే ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే పోలీసులకు ఫోన్ చేస్తారు. చాలా మంది పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ డిపార్ట్మెంట్కు మంచి పేరు తెస్తుంటే కొందరు మాత్రం చెత్త పనులు చేస్తూ..డిపార్ట్మెంట్కు చెడ్డపేరు పేరు తీసుకొస్తున్నారు. తాజాగా గోవాలో  ఓ డీఐజీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి పోలీసులకు మాయని మచ్చ తెచ్చాడు. ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అతనే పీకలదాకా తాగి ..మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఎవరా పోలీసు..ఏం చేశాడంటే..

గోవాకు చెందిన డీఐజీ  ఎ. కోన్‌ అనారోగ్యంతో కొన్ని రోజులు లీవ్  పెట్టాడు. ఈ క్రమంలో గోవాలోని  బగాలో ఒక పబ్‌కు వెళ్లాడు. అక్కడ ఫుల్ గా మద్యం తాగి..ఆ  మత్తులో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మొదట్లో పట్టించుకోని ఆ మహిళ.... డీఐజీ పదే పదే అసభ్యకరంగా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందింది. డీఐజీ వేధింపులు తట్టుకోలేక తీవ్ర ఆగ్రహంతో మద్యం మత్తులో ఉన్న ఎ కోన్ చెప్పుతో చెంపను చెల్లుమనిపించింది.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియో ఏముంది...?

ఆ వీడియోలో చేతిలో లిక్కర్ బాటిల్ పట్టుకున్న డీఐజీ ఎ కోన్....నడవడానికే ఇబ్బందిగా ఉన్నట్లు కనిపించాడు.  తూలుతూ తుళ్లుతూ నడుస్తుండగా...అతన్ని మరో వ్యక్తి పట్టుకున్నాడు. డీఐజీ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ సీరియస్ అయ్యారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీఐజీ ఎ కోన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 

గోవా అసెంబ్లీలోనూ చర్చ..

ఈ ఘటన గోవా అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ ఈ అంశాన్ని  లేవనెత్తారు.  మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన  ఘటనపై శాసనసభలో గందరగోళం నెలకొంది. డీఐజీ ఎ కోన్‌ను వెంటనే డీఐజీని విధుల నుంచి తొలగించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. దీంతో డీఐజీపై చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ సావంత్ వారికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే డీఐజీ ఎ కోన్ను విధుల నుంచి తొలగించారు.  2009 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఎ కోన్.. డీఐజీగా గోవాలో పనిచేయక ముందు ఢిల్లీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.