గోవా డ్రగ్ పెడ్లర్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

గోవా డ్రగ్స్ పెడ్లర్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో నమోదైన డ్రగ్స్ కేసులో డిసౌజా నిందితుడుగా ఉన్నాడు. హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, గోవా పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో డిసౌజాను పట్టుకున్నారు. గోవాలో డిసౌజా క్లబ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో హైదరాబాద్ పోలీసుల ఎదుట నిందితుడు హాజరైయ్యాడు. గోవాలో హిల్టాప్ క్లబ్ మాటున డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.