హైదరాబాద్‌సిటీ, వెలుగు : న్యూఇయర్పార్టీ కోసం గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్బాటిళ్లను వికారాబాద్ ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు ఇటీవల గోవా వెళ్లారు. డిసెంబర్31 నైట్న్యూఇయర్వేడుకలను గ్రాండ్చేసుకునేందుకు 95 లిక్కర్బాటిళ్లను కొన్నారు. వాటిని వాస్కోడిగామా రైలులో అక్రమంగా తీసుకొస్తూ శనివారం తెల్లవారు జామున వికారాబాద్రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు.
ముందస్తు సమాచారంతో వికారాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్సైలు ప్రేమ్‌కుమార్ రెడ్డి, వీరాంజనేయులు, ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది రైలులో తనిఖీలు చేయగా, నాలుగు బోగీల్లో రూ.లక్ష విలువ చేసే 95 గోవా లిక్కర్బాటిళ్లు దొరికాయి. కేసు నమోదు చేసి, వాటిని సీజ్‌చేశారు.