
గోవా..బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇవి తాటిచెట్లు, గుడిసెలతో,ఆందమైన ఆకర్షణీయమైన అరేబియా సముద్రంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బాగా బీచ్, కలాంగుట్ బీచ్,అంజునా బీచ్‌లు గోవాలో అత్యంత ప్రసిద్ధి బీచ్‌లు. అద్బుతమైన బీచ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో టూరిస్టులను అత్యధికంగా ఆకట్టుకున్న గోవాను బీచ్ స్వర్గం అని పిలుస్తారు. గోవా బీచ్‌లు అర్థచంద్రాకారంలో ,తాటి ,కొబ్బరి చెట్లతో నిండివుంటాయి. బీచ్‌ల వెంబడి రిఫ్రెష్‌మెంట్‌లను అందించే అనేక షాక్స్ ఉన్నాయి.బంగారు వర్ణం ఇసుక, అక్కడక్కడ గుడిసెలు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్ తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంతో దేశ విదేశాల టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తాయి. అటువంటి భారత దేశ పర్యాటక రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన గోవా ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలపోతోంది. గత కొద్దికాలంగా గోవాకు టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది.కారణాలను విశ్లేషిస్తే..
CEIC రిపోర్టు ప్రకారం..2019లో 85లక్షలున్న విదేశీ టూరిస్టులు 2023లో గోవాకు కేవలం 15లక్షలకు తగ్గారు. ఆగ్నేయాసియాలో మరింత అభివృద్ధి చెందిన,తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండటంతో గోవా తన వైభవాన్ని,ఆకర్షణను కోల్పోతోందని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వెన్నెముక,విదేశీ పర్యాటకులపై ఎక్కువగా ఆధారపడిన పర్యాటక పరిశ్రమ ఆర్థిక మాంద్యం ఫలితంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
గోవాకు విదేవీ టూరిస్టులు తగ్గడానికి మరో కారణం ఆటో మాఫియా.. గోవా ట్యాక్సీ కంపెనీలు చార్జీలు పెంచడం, మీటర్లు లేకపోవడం, అందించే కొన్ని సంస్ధలు పర్యాటకులను అడ్డగోలు ఛార్జీలతో దోచుకోవడం, విదేశీయులతో ఘర్షణలు ఇలా అనేక అంశాలు గోవా టూరిజంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ ఛార్జీల పారదర్శకత ప్రధాన సమస్యగా మారింది.
గోవా టూరిజంపై ప్రభావం చూపే మరో అంశం ఖర్చులు.. గోవా జీవన వ్యయం బాగా పెరిగింది. బడ్జెట్ టూరిస్టులకు ఇది మరింత ఖరీదైనది. ఎకాండేషన్, ఫుడ్, ట్రావెల్ ఛార్జీలు పెరగడం వల్ల తక్కువ ధరల్లో విహార యాత్ర చేయాలనుకునేవారికి గోవా దూరమవుతోంది. వీటి కారణంగా చాలా మంది టూరిస్టులు గోవాకు వచ్చేందుకు ఒకటిరెండు సార్లు ఆలోచిస్తున్నారు.
ఒకప్పుడు ప్రశాంతంగా ,అందంగా ఉన్న గోవా బీచ్‌లు ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణం వల్ల కూడా కొంత విదేశీ పర్యాటకులు తగ్గారని తెలుస్తోంది. 2019లో 85లక్షలున్న విదేశీ టూరిజం 2023లో కేవలం 15లక్షలకు తగ్గింది.
విదేశీ పర్యాటక రంగం క్షీణించడంతో పరిష్కార మార్గాలు వెతుకుతున్నాయి స్థానిక కంపెనీలు. విమానాశ్రయాలలో ల్యాండింగ్ ఖర్చులు,వీసా ఫీజులు తగ్గించడం, వీసా- ఆన్ -అరైవల్ విధానాన్ని క్రమబద్ధీకరించడం వంటి విధానాల కోసం పరిశ్రమలోని నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ చర్యలతో గోవా థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియాలతో గోవా పోటీ పడుతుందని అంటున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత గోవా విదేశీ పర్యాటకులకు టూరిజం ఎంపికగా ఉండేలా చూడాలని మెరుగైన ప్రజా రవాణా, బీచ్ సౌకర్యాలు, వంటి మౌలిక సదుపాయాల ఆధునీకరంచాలని కోరుతున్నారు.