ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

డిచ్‌పల్లి, వెలుగు: అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసమే సమాచార హక్కు చట్టం లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్​ గుగులోత్ శంకర్‌‌నాయక్‌ అన్నారు. గురువారం టీయూలో ఆర్టీఐ యాక్ట్ అవేర్నెస్ అండ్ అండర్​స్టాడింగ్ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్‌‌నాయక్‌ ప్రతి ఒక్కరూ ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్​61 కింద ఏదైన సమస్యపై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సంబంధిత అధికారి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా ఇవ్వని పక్షంలో పైఅధికారికి అప్పీల్​ చేసుకోవచ్చన్నారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై చర్యలతో పాటు, ఫైన్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో వీసీ రవీందర్​గుప్తా, ప్రిన్సిపాల్ హారతి, ఆర్డీవో రవి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎస్సై గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచేందుకే ‘తొలిమెట్టు’

ఇందల్వాయి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పేంచేందుకే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. గురువారం మండలంలోని గన్నారం స్కూల్‌లో జరిగిన టీఎల్ఎం మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కఠినతర పాఠ్యంశాలను స్టూడెంట్లను సులభంగా అర్థమయ్యేలా చేసేందుకే తొలిమెట్టు రూపొందించినట్లు చెప్పారు. పాఠ్యంశాలను వస్తు రూపంలోకి మార్చి ఆయా అంశాలను అర్థం చేయించడం ద్వారా అవగాహన, నైపుణ్యాలు మెరుగు పడతాయన్నారు. డీఈవో దుర్గాప్రసాద్, ఎంపీపీ రమేశ్‌నాయక్, పీఆర్టీయూ జిల్లా ప్రెసిడెంట్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్‌‌గౌడ్, సర్పంచ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

స్టూడెంట్ల స్కిల్స్‌ డెవలప్​చేయాలి

నవీపేట్: టీచర్లు స్టూడెంట్ల స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని మోడల్ స్కూల్‌లో నిర్వహించిన మండల టీఎల్ఎం ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. గవర్నమెంట్ స్కూళ్ల డెవలప్‌మెంట్‌ చేసేందుకే సీఎం కేసీఆర్‌‌ మన ఊరు మన బడి, తొలిమెట్టు ప్రోగ్రామ్స్‌ తెచ్చారన్నారు. అంతకుముందు టీచర్లు, పిల్లలు తయారుచేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, ఎంపీడీవో సాజిద్ అలీ, సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్, ఎంఈవో గణేశ్‌రావు పాల్గొన్నారు.  

బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు

కామారెడ్డి, వెలుగు: బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘ఆపరేషన్ స్మైల్’​పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటుక బట్టీలు, హోటళ్లు,  గృహ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న బాలలను గుర్తిం చి స్కూల్‌లో చేర్పించాలని ఆదేశించారు. స్కూళ్లలో స్టూడెంట్లు మత్తు పదార్థాలు వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ వాల్ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ  విభాగం ఆఫీసర్ స్రవంతి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ ఆఫీసర్ రమ్య, జిల్లా కార్మిక సంక్షేమ ఆఫీ సర్​ సురేందర్, సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్​ స్వర్ణల
త, ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖ ఆపీసర్లు పాల్గొన్నారు.

మోడీకి రూణపడి ఉంటాం..

నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని అర్సపల్లి ఆర్వోబీ, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.127.50 కోట్లు మంజూరు చేయడంపై బీజేపీ లీడర్లు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్సపల్లి ఆర్వోబి నిర్మాణానికి సేతు బంధన్ పథకం కింద ఫండ్స్‌ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు ఇందూరు ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ నిధుల్లో రూ.12 కోట్లు ఆర్వోబీ, రూ.115.50 కోట్లు అప్రోచ్ రోడ్లకు ఖర్చు చేయనున్నారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి,  నారాయణయాదవ్, స్వామియాదవ్, భారత్ భూషణ్, సుక్క మధు, వినోద్‌రెడ్డి, పోలీస్ శ్రీనివాస్, గిరి బాబు, లక్ష్మణ్, బాలకృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 

త్వరలో టీచర్ల సమస్యలు పరిష్కారం

నిజామాబాద్​రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ త్వరలో టీచర్ల సమస్యలే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా చెప్పారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో పీఆర్టీయూ తెలంగాణ క్యాలండర్‌‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కేసీఆర్‌‌ ఎవరూ సాటి లేరన్నారు. టీచర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.కృపాల్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రవీందర్, మహిళా ప్రతినిధి మనోజ, నాగేశ్వర్‌‌రావు, వాసుదేవరావు, తిరుపతిరావు, లింబయ్య, బుచ్చన్న, గంగాధర్, విద్యాసాగర్, విష్ణుప్రసాద్, అరవింద్, హుస్సేన్, భూమయ్య, ముత్తారం నర్సింహస్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.  

ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్‌ ట్రైనింగ్‌కు పిట్లం స్టూడెంట్లు

పిట్లం, వెలుగు: ఈ నెల 7 నుంచి 13 వరకు హర్యానలో జరిగే ఇంటర్నేషనల్ జూనియర్ రెడ్‌క్రాస్‌ ట్రైనింగ్ క్యాంపునకు పిట్లం స్టూడెంట్లు ఎంపికైనట్లు జూనియర్ రెడ్ క్రాస్ స్టేట్ కమిటీ మెంబర్ సంజీవరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఆరు రోజుల పాటు హర్యానాలో జరిగే ట్రైనింగ్‌కు కామారెడ్డి జిల్లా పిట్లం గర్ల్స్ హైస్కూల్ నుంచి మన్నే అంకిత, బ్లూబెల్స్​ స్కూల్‌కు చెందిన జంబిగే హన్సిక, తేజస్విని, మిస్బా మాహిన్, కార్తీక్, శ్రీరామలక్ష్మి, రాఘవులు ఎంపికయ్యారని తెలిపారు.  ఈ క్యాంపులో టీబీ, మలేరియా, హెచ్ఐవీ, హెపటైటిస్​బి, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, స్వచ్ఛ భారత్,  డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సోషల్ వాల్యూస్, ఐ డొనేషన్  తదితర అంశాలపై ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. రాష్ట్రం నుంచి 12 మంది ఎంపిక కాగా పిట్లం నుంచి ఏడుగురు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన స్టూడెంట్లను అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్ బాన్సువాడ డివిజన్ ​ప్రెసిడెంట్ వేణుగోపాల్, పిట్లం ప్రెసిడెంట్ బుగుడాల నవీన్‌కుమార్‌‌ పాల్గొన్నారు.