
రాయికల్, వెలుగు: రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రాయికల్‌మండలం అల్లీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీజేపీ కులం, మతం పేరిట ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందన్నారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, కష్టసుఖాల్లో అండగా ఉంటానని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, లీడర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లీడర్లు శైలేందర్ రెడ్డి, రాజిరెడ్డి, మాధవి, గంగారెడ్డి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.