ఛాతీపై బంతి తగిలి మరణించిన 16 ఏళ్ల గోల్ కీపర్

ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 16 ఏళ్ల గోల్ కీపర్ ఎడ్సన్ లోప్స్ గామా ఛాతీపై బంతి తగిలి  మరణించాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా బంతిని ఆపే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెనాల్టీ కిక్ ను ఆపుదామని  ఎడ్సన్ డైవ్ చేశాడు. అయితే అద్భుతంగా బంతిని ఆపినప్పటికీ అతని ఛాతికి బంతి బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నొప్పితో నేలపై పడిన వీడియో వైరల్ అవుతుంది. 

ALSO READ | Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో క్రికెట్‌పై రూ.3,20,000 ప్రశ్న.. సమాధానమిదే!

ది సన్ నివేదిక ప్రకారం.. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని మౌస్ పట్టణం నుండి గామాను కారులో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామీణ ప్రాంతం నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు 11 గంటల సమయం పట్టినట్లు సమాచారం. హాస్పిటల్ కు చేరుకోగానే లోప్స్  చనిపోయాడు. బాల్ స్టెర్నమ్, డయాఫ్రాగమ్‌ను తాకడంతో అతని మరణానికి దారితీసినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని శవపేటికను తీసుకువెళుతున్నప్పుడు లోప్స్ కుటుంబం అతని అభిమాన జట్టు గ్రెమియో షర్టులను ధరించిందని నివేదికలు చెబుతున్నాయి.