ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

సుడిగాలి సుధీర్ హీరోగా ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గోట్’. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్‌‌ అనేది ట్యాగ్‌‌లైన్. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు.  లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌‌లో  ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌‌ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ షెడ్యూల్‌‌లో సుధీర్, దివ్యభారతి జంటపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తీశాం. ఖర్చు విషయంలో రాజీపడకుండా రిచ్‌‌గా తెరకెక్కిస్తున్నాం. సుధీర్ కెరీర్‌‌లో మైల్‌‌స్టోన్‌‌గా నిలుస్తుంది’ అన్నారు.