మేక తోలుకు రంగేసి పులి చర్మం పేరుతో విక్రయం

వరంగల్‍ క్రైం, వెలుగు: మేక తోలుకు రంగు వేసి పులి చర్మం పేరుతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను టాస్క్​ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు. టాస్క్​ఫోర్స్​అడిషనల్‍ డీసీపీ వైభవ్‍ గైక్వాడ్‍ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన రనావత్‍ ఉండవార్‍, ములుగు జిల్లా రామచంద్రాపురానికి చెందిన బిల్లా రాజేశ్‍ మేక చర్మానికి కలర్లు వేసి పులి చర్మం పేరుతో ఓ వ్యక్తికి రూ.16 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలిసిన టాస్క్​ఫోర్స్​పోలీసులు హనుమకొండ జిల్లా ఆత్మకూర్‍ మండలం మహ్మద్‍గౌస్‍పల్లిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూర్‍ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.