కర్ణాటక రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ కలర్ మంచూరియా, పీచు మిఠాయి లను బ్యాన్ చేస్తూ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. వాటి తయారీలో హానికరమైన రోడమైన్- బి, టెక్స్‌టైల్ డై రసాయనాలు వాడుతున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కలర్ వాడని నార్మల్ గోబీ మంచురియా ఎవరూ కొనడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలర్ వాడకుండా చేసిన గోబీ మంచురియా ప్రజలు కనీసం చూడట్లేదని, ఆర్డర్స్ 80శాతం తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నారు. బిజినెస్ నష్టాల్లోకి పోతుందని గోడు వెళ్లబోస్తున్నారు. బెంగళూర్ లో రోజుకు రూ.10వేలు సంపాధించే వారు.. ఇప్పుడు రూ.5వేలు కూడా రాట్లేవని హోటల్ ఓనర్స్ అంటున్నారు.