ప్రతి శనివారం చాలామంది శని భగవానుడిని దర్శించుకొని నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ తరువాత నువ్వులతో పూజలు చేస్తారు. ఇలా చేస్తే శనిప్రభావం తమపై ఉండదని నమ్ముతుంటారు. అయితే శనీశ్వరుడి పూజించడం మంచిదే కాని.. శని భగవానుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. . .
- అంగట్లో అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉంటే కలిసిరాదు అనే మాట పెద్దలు ఊరికే అనలేదు.. మనం ఎంతగా డబ్బులను సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అనుకుంటారు.. శని ప్రభావం ఉంటే వారికి కలిసిరాదు.. అందుకే చాలా మంది శని దేవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు..
- శనీశ్వరుని ఆలయానికి వెళ్ళినప్పుడు శనిభగవానుడి విగ్రహానికి ఎదురుగా నిలబడకూడని పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడి కళ్లలోకి చూడకూడదట.
- శని దేవునికి పూజలు చేసేటప్పుడు ఎప్పుడూ ఆయన పాదాలవైపు మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.
- శనికి ఎదురుగా నిలబడి మొక్కుకోవడం నేరుగా శనీశ్వరుడి కళ్ళ లోకి చూడడం లాంటివి చేయకూడదు.
- శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు రంగులు బట్టలను వేసుకోకూడదు.. నీలం లేదంటే నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ రంగులు శని దేవుడికి ఇష్టమైన రంగులు.
- శని దేవుడికి నూనెతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రలు ఉపయోగించకూడదు. శనికి ఇనుము అంటే చాలా ఇష్టం. అందువలన కేవలం ఇనుప పాత్రలోనే ఉపయోగించాలని పూజారులు చెబుతున్నారు.
- శనిశ్వరుడిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపుకు తిరిగి పూజలు చేయకూడదు.. శనిని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా పడమటి వైపుకు మాత్రమే ఉండి పూజించాలి..
- ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయంలో నువ్వులు, ఉలవలు లేదా శనగలను దానం చెయ్యడం చాలా మంచిదట.
- శని ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు వెన్ను చూపించి బయటకు రాకూడదు.. ఇలా అస్సలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు.