Vastu Tips: ఇంట్లో గోడలకు దేవుడి ఫొటోలు ఉండొచ్చా.. బెడ్​ రూంలో ఎలాంటి ఫొటోలు ఉండాలి..!

Vastu Tips: ఇంట్లో గోడలకు దేవుడి ఫొటోలు ఉండొచ్చా.. బెడ్​ రూంలో ఎలాంటి ఫొటోలు ఉండాలి..!

ప్రతి ఇంట్లో దేవుడి పటాలు.. ఫొటోలు .. దేవుళ్లకు సంబందించిన చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి.  అయితే కొంతమంది  దేవుడి పటాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక..ఇబ్బంది పడుతుంటారు.  కొంతమంది గోడలకు వేలాడదీస్తుంటారు. అసలు దేవుడి పటాలు ఇంట్లో ఎలా ఉండాలి.. ఎలాంటి పటాలు ఎక్కడ పెట్టుకోవాలి.. వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రమణ్యం సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .

 ప్రశ్న​ : పూజ గదిలోనే కాకుండా దేవుడి ఫొటోలు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చా? అంటే  ఇంట్లో హాల్లో దేవుడి ఫొటోలు పెద్దవి గోడకు పెట్టుకోవచ్చా.. అలా ఉంటే నష్టం జరుగుతుందని కొందరు చెబుతుంటారు..  అది నిజమేనా?  గోడలకు ఎలాంటి ఫొటోలు .. ఎక్కడ ఉంటే మంచివి? ఎలాంటివి ఉండకూడదు.. ?

Also Read :  కుంభరాశిలో నాలుగు గ్రహాల సంయోగం

 జవాబు : ఇంట్లో దేవుడి ఫొటోలను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే ఎలాంటి ఫొటోలనైనా గోడలకు తగిలించుకోవచ్చు. కొంతమంది దేవుడి ఫొటోలు బెడ్ రూముల్లో ఉండొద్దంటారు. కానీ  ఉండవచ్చని వాస్తు నిపుణులు కాశీనాథుని సుబ్రమణ్యం అంటున్నారు.  దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. కేవలం భయంకరంగా వికృతంగా ఉన్నవి మాత్రం ఉండకూడదు. ముఖ్యంగా బెడ్ రూముల్లో వాటిని పెట్టుకోవద్దు. అలాగే జంతువుల బొమ్మలు కలిగిన ఫొటోలు కూడా ఇంట్లో ఉండకూడదు. చాలామంది ఇళ్లల్లో ఎక్కడినుంచో తెప్పించుకున్న సీనరీలు పెట్టుకుంటారు. వాటితో నష్టమేమీ లేదు కానీ అవి భయంకరంగా, ముదురు రంగులో ఉంటే మంచిది కాదు..