ఆధ్యాత్మికం : శ్రమ విలువ చెప్పే పూజ.. అర్పించే పువ్వులు ఏంటీ.. ప్రసాదం సామూహిక ధర్మమా..

ఆధ్యాత్మికం : శ్రమ విలువ చెప్పే పూజ.. అర్పించే పువ్వులు ఏంటీ.. ప్రసాదం సామూహిక ధర్మమా..

హిందువులు దాదాపు అందరూ దేవుడిని పూజిస్తారు...భగవంతుడికి  భగవంతుడికి రకరకాల పూలు, ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తారు. కానీ వాటి వెనక ఆంతర్యం గురించి అంతగా ఆలోచించరు. దేవుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం వెనక భక్తికి చెందిన అంశమే కాదు... మనిషికి, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .  .

పూలతో దేవుడిని పూజించడం అంటే  ఏమిటి

చెట్లకు, మొక్కలకు పూసే పూలని కాదు. మనిషిలో ఉన్న దుర్గుణాలను వదిలేసి, మంచి ప్రవర్తనతో నడిచే విధానాన్ని నేర్పే పూలు అని కూడా అర్ధం. నైవేద్యం పెట్టడం అంటే దేవుడికి భోజనం పెట్టడం కాదు. ఆహారం తయారు చేయడంలో శుచి, శుభ్రత పాటించాలని, శ్రమ విలువ తెలుసుకోవాలని చెబుతున్నారు.  

ALSO READ : ఆధ్యాత్మికం:  దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడో తెలుసా..

అర్పించే పువ్వులు

  • భగవంతుడిని పూలతో అంకరిస్తారు. కానీ చెట్లకు పూసే పూలకన్నా మనిషి ప్రవర్తనలో దాగి ఉన్న మంచి పూలతో పూజించాలని చెప్తున్నాయి మన పురాణాలు...
  •  మొదటి పుష్పం అహింస... బంధువులు, స్నేహితులకే కాదు. ఎవరికీ బాధకలిగించ కుండా జీవించాలి.
  • రెండో పుష్పం ఇంద్రియ నిగ్రహం... జ్ఞానేం ద్రియాలను, కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
  • మూడో పుష్పం దయ... సాటివారికి సాయం చేస్తూ, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి.
  • నాలుగో పుష్పం క్షమ.. ఎవరైనా బాధ
  • పెట్టినా, అపకారం చేసినా క్షమించాలి తప్ప, తిరిగి అపకారం చేయకూడదు.
  • అయిదో పుష్పం ధ్యానం.. ఇష్టమైన దేవుడిని ఎలా ధ్యానం చేస్తారో, అలాగే నమ్మిన వాళ్లను మోసం చేయకుండా, ఎప్పుడూ చేసే పనుల మీద ధ్యాస పెట్టాలి.
  •  ఆరో పుష్పం తపస్సు.. మాట, మనసు, శరీరం మూడింటిని భగవంతుడి మీదే నిలపాలి. అంటే విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఇలాంటి తపస్సులాగే బాధ్యత లు నిర్వహించాలి.
  • ఏదో పుష్పం జ్ఞానం.. ఏ కార్యాన్నైనా మొదలు పెట్టే ముందు దాని గురించి పూర్తిగా తెలు సుకోవటమే జ్ఞానం. అప్పుడే ముందుకు వెళ్లగలరు. ఆ కార్యాన్ని పూర్తి చేయగలరు.
  • ఎనిమిదో పుష్పం సత్యం.. అబద్ధాలు ఆడకుండా, లోక రీతిని బట్టి నడుచుకోవడ మే సత్యం.
  • ఈ ఎనిమిది రకాలతో రోజూ దేవుడిని అలం కరించాలి. అంటే ప్రతి వ్యక్తి వీటిని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలన్నమాట. అప్పుడే సంతోషంగా ఉంటారు.

నైవేద్యం సామూహిక ధర్మం

'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అంటారు. అలాంటి భగవంతుడి స్వరూపాన్ని పారేయకూడదన్న విషయం. భోజనం తినే ప్రతిసారీ గుర్తుకు వస్తుంది. దాంతో ఆహారాన్నివృథా చేయరు. చాలామంది భోజనం తింటూ 'అది బాగలేదు. ఇది బాగలేదు. అలా పండితే బాగుండేది' లాంటి వంకలు పెడుతుంటారు. రుచికే ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని అలా అనకూడదన్న భావన కూడా దీనిలో అంతర్గతంగా దాగి ఉంది.
భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, దానిలో కొద్దిగా అయినా అతిథులకు పెట్టడం సంప్రదాయం. అంటే తనతోపాటు ఇతరుల ఆకలినీ గుర్తించాలన్న సామాజిక స్పృహ నైవే ద్యంలో కనిపిస్తుంది.

  • ఆహారం తినే ముందు 'నేను సంపా దించాను' అనే గర్వం కలుగుతుంది. దాని నుంచి బయటపడటానికే తినే ముందు దేవుడికి నైవేద్యం పెట్టడం ఆచారంగా వచ్చిందని చెప్పొచ్చు.
  • దేవుడికి నైవేద్యంగా పెట్టేదాన్ని 'రైతులు కష్టపడి పండిస్తారు.ప్రకృతి అనుకూలిస్తుంది. తోటి మనుషులు సాయం చేస్తారు'. అనే ఆలోచన గుర్తుకు రావాలి. అందువల్ల నైవే ద్యంలో సామూహికమైన కష్టం దాగి ఉంది.

–వెలుగు,లైఫ్​‌‌–