బాల్కొండ, వెలుగు: బాల్కొండ మండలంలోని జలాల్‌పూర్‌లో గోదావరి నదీ తీరంలో గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం సోమవారం కమనీయంగా నిర్వహించారు. తొలుత ఎదుర్కోళ్ల ఘట్టం నిర్వహించారు. స్వామి కల్యాణానికి ఉదయం నుంచే భక్తులు బారులుదీరి మొక్కులు చెల్లించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామివారి కల్యాణంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు.
నందిపేట, వెలుగు: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో గోదా రంగనాథ కల్యాణం మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ కమిటీ ఆద్వర్యంలో జరిగిన వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పల్లకీసేవలో పాల్గొన్న పోచారం
బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బీర్కూర్, తిమ్మాపూర్ గ్రామాల శివారులోని టీటీడీ దేవస్థానంలో గోదా రంగనాథ స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి పల్లకీ సేవలో పాల్గొన్నారు.