
మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదారంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అర్చకులు నరేందర్చార్యులు, రంగాచారి, ఆలయ ధర్మకర్త మధుసూదన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. - మెదక్ టౌన్, వెలుగు