కుటుంబానికి ఆమే ఆధారం.. వెల్లడించిన గోడాడీ సర్వే

కుటుంబానికి ఆమే ఆధారం.. వెల్లడించిన గోడాడీ సర్వే

హైదరాబాద్‌‌, వెలుగు: చిన్న వ్యాపారాలు నడుపుతున్న మహిళలలో 37 శాతం మంది  కుటుంబానికి దన్నుగా ఉన్నారని, వీరి సంపాదనపైనే కుటుంబం ఆధార పడుతోందని గోడాడీ సర్వే పేర్కొంది. ఏఐ వంటి కొత్త టెక్నాలజీలను వాడడంలో వీరు ముందుంటున్నారని తెలిపింది. ఈ సర్వే ప్రకారం, ఇండియాలోని చిన్న వ్యాపారాల్లో 27 శాతం మహిళలు నడుపుతున్నారు. 

వీటిలో 74శాతం వ్యాపారాలు గత ఐదేళ్లలోనే ప్రారంభమయ్యాయి. తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో ఏఐ సాయపడుతుందని 79 శాతం మంది మహిళా వ్యాపారులు పేర్కొన్నారు. ఏఐ సాయంతో వారానికి 12 గంటలు ఆదా చేయొచ్చని వీరు చెప్పారు. వెబ్‌‌సైట్‌‌ను ఏర్పాటు చేయడం, లోగో డిజైన్‌‌, డిజిటల్ మార్కెటింగ్‌‌ వంటివి ఏఐ సాయంతో చేస్తున్నామని తెలిపారు.