కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణ ఉత్సవం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసం చివరి రోజు భోగి నాడు స్వామివారి కల్యాణోత్సవం జరిపించడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన అనంతరం శ్రీ దారురీ శ్రీనివాస్ చార్యుల తిరుపావై ప్రవచనంతో ముగిశాయి. పుణ్యాహవచనంతో మొదలై, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణలతో కొనసాగుతూ ప్రతిసర బంధన, అగ్ని ప్రతిష్ఠ, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణతో ముగుస్తుంది.